
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి.. 250 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్ అద్భుతమైన హాఫ్ సెంచరీలకి తోడు ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ కిరాక్ బ్యాటింగ్ తో టీమ్ అత్యధిక పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ తీసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ– సాల్ట్ మధ్య నెలకొన్న 37 పరుగుల భాగస్వామ్యాన్ని అన్షుల్ కాంబోజ్ విడదీశాడు. 28 పరుగులతో మంచి ఊపుమీద కనిపించిన విరాట్ కోహ్లీని ట్రాప్ చేసి కాంబోజ్ అవుట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన దేవదత్ పడిక్కల్ తో కలిసి ఫిల్ సాల్ట్ ఆర్సీబీ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీ చేసే దిశగా ప్రయణిస్తున్న అతడ్ని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ శివమ్ దూబే బౌలింగ్ (10.4) లో నూర్ అహ్మద్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.
►ALSO READ | చెన్నై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ధోనీ గాయంపై రుతురాజ్ బిగ్ అప్డేట్
ఆ తర్వాత అసలు మ్యాచ్ ప్రారంభమైంది. మైదానంలోకి వచ్చిన పడిక్కల్ మెరుపు బ్యాటింగ్(50)తో హాఫ్ సెంచరీ చేసి 151 పరుగుల వద్ద జేమీ ఓవర్టిన్ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకవైపు, కెప్టెన్ రజత్ పాటిదార్ (48 నాటౌట్) ఆచితూచి బ్యాటింగ్ చేస్తుండగా.. డేవిడ్ (70 నాటౌట్) మాత్రం సిక్సర్లతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. తాను చేసిన 70 పరుగులలో ఏకంగా 8 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇక సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టిన్, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.
6️⃣6️⃣6️⃣ !
🎥 Tim David goes berserk, 𝐬𝐭𝐫𝐢𝐤𝐢𝐧𝐠 three maximums in the over 🤩
Updates ▶️ https://t.co/PkhPvxcU44#TATAIPL | #KhelBindaas | #RCBvCSK | @rcbtweets pic.twitter.com/fRlsLI1JXU
— IndianPremierLeague (@IPL) April 5, 2026