
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ సమీపంలో ఒక డ్రోన్ కనబడడం సంచలనమైంది. మాల్దా లోని మాలతీపూర్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని గజోల్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కబోతుండగా సమీపం నుంచి ఒక డ్రోన్ అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించింది. దీంతో భద్రతాధికారులు అప్రమత్తమయ్యాయి. తక్షణం దర్యాప్తు ప్రారంభించి ముగ్గురిని అరెస్టు చేశారు. మమత హెలికాప్టర్‌కు దగ్గర్లో డ్రోన్ కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి ముందు మాల్దాలో మమతా బెనర్జీ ఎన్నికల ప్రకారం సాగించారు.