కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు దోసకాయ ముక్కలు, 250 గ్రాముల పల్లీలు, 100 గ్రాములు పచ్చి మిర్చి, పావు కిలో టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 4 వెల్లుల్లి, అర టీ స్పూన్ పసుపు, నిమ్మకాయంత చింతపండు, నూనెను తీసుకోవాలి.
ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, అది వేడయ్యక దానిలో పచ్చి మిర్చి, టమాటాలు వేసి బాగా వాటిని బాగా మగ్గించాలి. ఆ తర్వాత వీటిలో చింత పండును కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
అయితే రోటిలో కానీ, మిక్సీలో ఈ పచ్చడిని నూరుకోవాలి . వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, ఒక కప్పు టమాటా ముక్కలు, నాలుగు ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి బాగా దంచుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి దీనిని బాగా రుబ్బుకోవాలి.
ఇక స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి, అది వేడయ్యాక దానిలో అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , అర కప్పు ఎండు మిర్చిని కూడా వేసి వేయించాలి. ఈ పోపును తీసుకువెళ్లి దోసకాయ పల్లీల పచ్చడిలో అంతా మిక్స్ అయ్యేలా కలపాలి.
దోసకాయ, పల్లీల పచ్చడి ఇంకా టేస్టీగా ఉండాలంటే దానిలో ఒక టేబుల్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి రుచిని ఇస్తుంది. చట్నీ చిక్కగా రావాలంటే దానిలో నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఒక ప్లేట్ దోసె, ఒక ఇడ్లీ తినే వాళ్ళు ఈజీగా ముందు ప్లేట్స్ పక్కా లాగిస్తారు.




