Reading Time: < 1 minute

 ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఓ బాలిక మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 5లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బాలిక కీర్తి, సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. ఇద్దరిని బైక్‌పై వారి తండ్రి తీసుకుని వస్తుండగా రోడ్డు నంబర్ 5వద్ద వేగంగా వచ్చి ఆర్‌టిసి బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో బాలిక బస్సు కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా, తండ్రి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్‌టిసి బస్సు డ్రైవర్ నిర్లక్షంగా బస్సును నడపడం వల్లే బాలిక మృతిచెందినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలిక తండ్రి, సోదరుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.