
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌లో తమ గెలుపు ఖాతా తెరవాలని గుజరాత్ భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్.. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. పాయింట్స్ టేబుల్‌లో నెం.1 స్థానం దక్కించుకొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కి జిటి జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు గాయం కావడంతో రషీద్‌కు తాత్కాలికంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. గిల్ స్థానంలో కుమార్ కుషాగ్రా ఈ మ్యాచ్‌తో ఐపిఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇక రాజస్థఆన్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ స్థానంలో తుషార్, బిష్ణోయ్ స్థానంలో శుభమ్ దూబెలను జట్టులోకి తీసుకుంది.
తుది జట్లు:
ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డొనొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.
జిటి: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(కెప్టెన్), కగిసో రబాడా, అశోశ్ శర్మ, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.