
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఉత్కంఠ పోరులో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసే హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేయాలని చూస్తుండగా, లక్నో బౌలర్లు ప్రారంభంలోనే వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పిచ్ పరిస్థితులు మ్యాచ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చే ఛాన్స్ ఉంది.
లక్నో జట్టు కెప్టెన్ పంత్ మాట్లాడుతూ.. ఈ పిచ్ బాగుంది, ముందుగా ప్రత్యర్థిని బ్యాటింగ్ చేయించి తర్వాత ఒత్తిడిలోకి నెట్టాలని భావిస్తున్నాం.. మొదటి ఆరు ఓవర్ల తర్వాత బంతి కొంచెం నెమ్మదిగా మారే అవకాశం ఉంది.. జట్టులో ఒక మార్పు చేశాం, మనీమరణ్ సిద్ధార్థ్ జట్టులోకి వచ్చాడని రిషబ్ వెల్లడించాడు.
హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. సొంత ప్రేక్షకుల ముందే ఆడడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది.. జట్టులో రెండు మార్పులు చేశాం, లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారని తెలిపాడు. నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడం ముఖ్యం, ప్రతి మ్యాచ్‌ను ఒక్కో దశగా తీసుకుంటూ ముందుకు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాడు.
►ALSO READ | ఉప్పల్ స్టేడియంలోకి.. బ్లూ టూత్, స్మార్ట్ వాచెస్ నో ఎంట్రీ..ప్రేక్షకుల ఆందోళన
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మనీమరణ్ సిద్ధార్థ్, అవేశ్ ఖాన్, మొహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాథి, ప్రిన్స్ యాదవ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్
🚨 Toss 🚨@lucknowipl won the toss and elected to bowl first against @sunrisers in Hyderabad.
Updates ▶️ https://t.co/qC2rF1Hiiz#TATAIPL | #KhelBindaas | #SRHvLSG pic.twitter.com/46Irok9agd
— IndianPremierLeague (@IPL) April 5, 2026