Reading Time: < 1 minute
Pakistan Defense Minister Threatens India Kolkata Missile Warning Rajnath Singh Response

Khawaja Asif: పాకిస్థాన్ బలుపు మాటలు అస్సలు తగ్గడం లేదు. ఓ వైపు మధ్యప్రాచ్యంలో యుద్ధంతో దాయాది దేశం అతలాకుతలమవుతోంది. నిత్యవసర సరకులతోపాటు పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంత జరిగినా బలుపు మాత్రం తగ్గడం లేదు. అక్కడెక్కడో యుద్ధం జరిగితే తినడానికి సరిగ్గా తిండి దొరకక కొట్టుమిట్టాడుతున్న పాక్ భారత్‌పై దాడి చేస్తుందట. ఒకవేళ భారత్ పాకిస్థాన్ యుద్ధం వస్తే తాము కేవలం సరిహద్దులకే పరిమితం కామని.. ఏకంగా కోల్‌కతాను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిచ్చికూతలు కూశాడు. వాస్తవానికి, ఇటీవల భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. భారత్ ఇచ్చే సమాధానం గతంలో కంటే చాలా డేంజర్‌గా ఉంటుందని వెల్లడించారు.

READ MORE: Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్

ఉరి దాడుల తర్వాత చేసిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా అనంతరం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడులు, పహల్గామ్ ఘటన తర్వాత నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ వంటి పరాక్రమాలను గుర్తు చేశారు. ఈ వార్నింగ్‌తో పాకిస్థాన్ ఒక్కసారిగా బెంబేలెత్తింది. ఈ అంశంపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి జరిగి ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో భారత్ పాక్‌ను బెదిరిస్తోందని ఆరోపించారు. భారత్‌ తమపై దాడి చేస్తూ తాము చూస్తూ ఊరుకోమన్నారు. తమ ప్రతిదాడులు భారత్‌ లోపలి వరకు వెళ్తాయని వెర్రి కూతలు కూశారు. జమ్ముకశ్మీర్, పంజాబ్‌లోనే కాదు. కోల్‌కతా వరకు దాడులు చేస్తామని, తమ వద్ద ఆ స్థాయి మిస్సైల్స్ ఉన్నాయన్నారు. భారత్‌ తమపై దాడులు చేసేందుకు ప్రస్తుతం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇక పాకిస్థాన్ ఇంతలా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఆ దేశం వద్ద ఉన్న 2750 కిలోమీటర్ల పరిధి గల అత్యంత సుదూర క్షిపణి షాహీన్-III అని నిపుణులు చెబుతున్నారు.