Reading Time: < 1 minute

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఏడు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 84 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ సిబి జట్టు 250 పరుగులు చేసింది. ఆర్ సిబి జట్టు 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. కార్తీక్ శర్మ కూడా ఆరు పరుగులు చేసి మైదానం వీడాడు. ఈ మ్యాచ్ లో సంజూ శామ్సన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో శివమ్ దూబే(8), ప్రశాంత్ వీర్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బెంగళూరు బౌలర్లలో జాకోబ్ డఫీ రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు.