
మన తెలంగాణ/ దరాబాద్: ఆర్‌టిసి ప్రధాన కార్యాలయం బస్ భవన్‌లో ఐటి, జిఎస్‌టి అధికారులు స్వాధీనం చేసుకున్న ఎ బ్లాక్‌లోని నాలుగు ఫ్లోర్‌లను ఎపి అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అన్ని గేట్‌లకు తాళాలు వేసి సీల్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం బస్‌భవన్‌లోని ఎ బ్లాక్‌ను ఎపి ఆర్‌టిసికి కే టాయించారు. పదేళ్లు ఇక్కడి నుండే ఎపిఎస్ ఆర్‌టిసి కార్య క లాపాలు నిర్వహించింది. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్ర కారం ఆర్‌టిసి ఆస్తుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. దీంతో ఎపి ఆర్‌టిసి అధికారులు ఎ బ్లాక్‌కు తాళాలు వేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రభుత్వం తమకు కేటాయించిందని ఐటి, జిఎస్‌టి అధికారులు ఆ తాళాలను పగులగొట్టి వాటికి త మ తాళాలు వేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేసిన ఎపి అధికారులు శుక్రవారం రాత్రి నుం డి తమ తాళాలు వేసి సీల్ చేశారు.
శనివారం బస్ భవన్ ఎ బ్లాక్‌లోని నాలుగు అంతస్తుల ప్రస్తుత పరిస్థితులను పర్య వేక్షణ కోసం తెలంగాణ ఆర్‌టిసి జెఎసి చైర్మన్ ఈదురు వెంక న్న , వైస్ చైర్మన్ ఎం.థామస్‌రెడ్డి, ముషీరాబాద్ డిపో జెఎసి నాయకులు ఎన్.కృష్ణలు ఎ బ్లాక్‌కు వెళ్లి పరిశీలించారు. కాగా ఎ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్ వద్ద ఎపికి చెందిన 6 గురు సిబ్బందితో పాటు ఇద్దరు ఉన్నతాధికారులు ఒక ఎఎమ్‌టి, ఇద్దరు ఆర్‌టిసి కానిస్టేబుళ్లను బందోబస్తు పెట్టీ గేట్‌కు ఆంధ్ర తా ళాలు వేసి సీల్ చేశారు. అలాగే 2,3,4, అంతస్తుల్లో కూడా ఎపి అధికారులను, సిబ్బందిని కాపలా పెట్టీ అన్ని గెట్‌లకు తాళాలు వేసి సీల్ వేశా రు.ఈ సందర్భంగా ఆంధ్ర అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ తెలంగాణ ఆర్‌టిసికి చెందిన యూనియన్ నాయకులు, పూ ర్తిగా సహకరించడం వల్లే తాము ఈ రోజు ధైర్యంగా ఇక్కడ ఉన్నామని తెలిపారు. తెలంగాణ కార్మిక వర్గం తమను అర్థం చేసుకోవాలని, ఈ బస్‌భవన్ నిర్మాణం ఎపి, తెలంగాణ ఆర్‌టి సి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా చేసి పైసా పైసా పోగుచేసి కార్మికుల సంక్షేమo కోసం,
కార్మికులకు సంబంధించిన అన్ని విభాగాల లావాదేవీల కోసం నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కన్ను పడిందని, ఇప్పడు ఎ బ్లాక్ ఆంధ్ర వాళ్ళదని చెప్పి అక్రమంగా ఆక్రమించి రేపు తెలంగాణకు చెందిన బి బ్లాక్ ను కూడా అక్రమంగా అధికార బలంతో ఆక్రమించరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. బస్ భవన్ ముందు ఉన్న 11 ఎకరాల ఖాళీ స్థలాలు కూడ ఈ ప్రభుత్వం కబ్జా చేయదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్‌టిసి జెఎసి తరుపున ఎపి సిబ్బందికి అండగా ఉంటామని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు గట్టిగా పోరాదామని తెలంగాణ ఆర్‌టిసి జెఎసి నాయకులు సూచించారు. అందులో బాగంగా ఏప్రిల్ 7 న బస్ భవన్ బచావో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.