Reading Time: < 1 minute
Vivek Agnihotris Operation Sindoor Film On Indias Strikes Inside Pakistan Announced

బాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములాగా మారాయి పేట్రియాట్ ఫిల్మ్. ఛావా, ధురంధర్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. పేట్రియాటిజం కోణంలో వచ్చే వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కూడా ఆదరణ దక్కుతోంది. మన దేశంపై శత్రుదేశాలు చేస్తున్న అరాచకాలను తిప్పికొడుతూ చేపట్టిన పోరాటాలు, ఆపరేషన్స్ కూడా సిల్వర్ స్క్రీన్‌పై కథ వస్తువులుగా మారాయి. సల్మాన్ మాతృభూమి ఈ కోవకు చెందినదే.

Also Read  :  Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్

దేశభక్తి చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు కలెక్షన్స్ కురవడంతో బాలీవుడ్ మేకర్స్ ఈ తరహా కథలపై ఫోకస్ చేస్తున్నారు. ధురంధర్2 ఇచ్చిన డేర్‌తో ఓ స్టెప్ ముందుకేస్తున్నారు. నెక్ట్స్ మరో వార్ బ్యాక్ డ్రాప్ కమ్ దేశ భక్తి స్టోరీ సిల్వర్ స్క్రీన్‌పైకి రాబోతుంది. అదే ఆపరేషన్ సిందూర్. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడుల్లో మన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాక్ అండ్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాదులను తుదముట్టించింది. ఆ వెంటనే సిల్వర్ స్క్రీన్ ఇదే స్టోరీతో, ఇదే పేరుతో సినిమాలు తెరకెక్కించాలని బాలీవుడ్ మేకర్స్ ప్రయత్నించారు. అందులో టీ సిరీస్ కూడా ఒకటి. టీ సిరీస్ కూడా ఆపరేషన్ సిందూర్ పేరును రిజిస్టర్ చేయించగా.. తాజాగా దర్శకుడ్ని ఎనౌన్స్ చేసింది. కాశ్మీర్ ఫైల్స్, ద వ్యాక్సిన్ వార్‌తో కాంట్రవర్షియల్ దర్శకుడిగా పేరుగాంచిన వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని హ్యాండిల్ చేయబోతున్నాడు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజెఎస్ థిల్లాన్ రాసిన ఆపరేషన సిందూర్.. ద అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్ సైడ్ పాకిస్తాన్ పుస్తకంగా ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం లోతైన పరిశోధన చేశాడట డైరెక్టర్. త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ ఫిల్మ్ టీ సిరీస్, ఐయామ్ బుద్ద ప్రొడక్షన్స్‌తో కలిసి భారీగా నిర్మించనుంది. మొత్తానికి ధురంధర్2 బాలీవుడ్‌కు కొత్త బూస్టప్‌నిచ్చిందనే చెప్పాలి.