
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈవారం కొన్ని విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వ ప్రకారం గా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలు సాగుతాయి. నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి వ్యవహరించండి. సంతాన సంబంధమైన విషయాలలో విద్యా సంబంధమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది. ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం చదవండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిధున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పనిలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. దానివల్ల నష్టాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణయత్నాలు చెయ్యకపోవడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సలహాలు ఎక్కువగా తీసుకొని ముందుకు వెళ్లడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన ఫీజులు లైసెన్సులు కాంట్రాక్టులు లభిస్తాయి. ఈ రాశి వారు దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి. స్టిరాస్తికి సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. సినీ కళా రంగాలలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఈ రాశి వారు ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి వారికి ఈ ఈవారం చాలా అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండండి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది. గృహ అలంకరణ వస్తువుల కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గణపతి స్వామి వారికి బుధవారం రోజున గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. రాహుకాల సమయంలో ఎరుపు వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 4 కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తులా రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుండో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వారం ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. మీరు తీసుకునే స్వంత నిర్ణయాలు లభిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం చాలావరకు లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ భక్తులతో దీపారాధన చేయండి అలాగే దుర్గాదేవి స్తోత్రం తప్పనిసరిగా చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సొంతంగా చేసే వ్యాపారాలలో చిన్నపాటి నష్టాలు వస్తాయి. సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. మీరు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. రాశి వారికి కలిసివచ్చి సంఖ్య రెండు. ఏదైనా పని మీద పెట్టబలేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి, కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సినీ కళా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి గోతిరిస్తుంది జాగ్రత్త వహించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది అయినప్పటికీ శని బలంగా ఉన్నారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార పరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. ఆరోగ్యపరంగా కూడా చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సమయానికి తగిన నిద్ర ఆహారం తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సేవింగ్స్ కి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. దైవ చింతన పెరుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తులను ఏర్పరచుకోగలుగుతారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం సంతాన ప్రాప్తి కలుగుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. దూర ప్రాంత వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.