చాలామంది ఇళ్లల్లో అంతా బాగుంది అనుకునే లోపే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. కారణం లేకుండానే గొడవలు జరగడం, మనశ్శాంతి కరువడం వంటివి జరుగుతుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తులు ప్రవేశించినప్పుడు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయట. వాటిని నిర్లక్ష్యం చేస్తే లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పదే పదే పగిలిపోయే గాజు వస్తువులు: మీ ఇంట్లో ఎలాంటి కారణం లేకుండానే పదే పదే గాజు పాత్రలు, ఫొటో ఫ్రేమ్‌లు కింద పడి పగిలిపోతున్నాయా? అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలు మంచి సంకేతం కాదు. ఇక ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో ఏదో తెలియని భయం: బయట ఎంతో హుషారుగా తిరిగిన వాళ్ళు కూడా.. ఇంటిలోకి రాగానే ఒక్కసారిగా ఊపిరి ఆడనట్లు అనిపించడం, మనసు భారంగా మారడం జరుగుతుంటుంది. ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్నా కూడా ఎవరో మనల్ని గమనిస్తున్నట్లు అనిపించడం, సడెన్‌గా ఉలిక్కిపడటం వంటివి కూడా నెగటివ్ ఎనర్జీకి సంకేతాలేనట!

వింత శబ్దాలు.. కదిలే వస్తువులు: తలుపులకు గాలి తగలకపోయినా వాటంతట అవే శబ్దాలు చేయడం, రాత్రి పూట ఏవో వింత వింత శబ్దాలు వినిపించడం, వస్తువులు ఉన్నచోటు నుంచి పక్కకు జరగడం లాంటివి గమనిస్తే.. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసి కూర్చుందని అర్థం చేసుకోవచ్చు.
పసిపిల్లల ఏడుపు.. అనవసర గొడవలు: ఇంట్లో ఎలాంటి కారణం లేకుండానే భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవుతుంటే కాస్త అలర్ట్ అవ్వాలి. ఇక అలాగే చిన్న పిల్లలు పదే పదే ఏడవడం, ఇంట్లో వారికి వరసగా అనారోగ్య సమస్యలు రావడం, తీవ్రమైన ఆర్థిక నష్టాలు ఎదురవడం వెనుక కూడా ఈ ప్రతికూల శక్తుల ప్రభావం ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు భయపడకుండా ఇంట్లో పూజలు చేయడం, ఉప్పు నీటితో ఇల్లు తుడవడం, కర్పూరం లేదా సాంబ్రాణి పొగ వేయడం వల్ల చాలా వరకు నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇల్లు ప్రశాంతంగా మారుతుంది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం వాస్తు శాస్త్ర విశ్వాసాలు మరియు నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వబడింది. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.
The post ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకుంటే ప్రమాదం.. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ హెచ్చరిక! appeared first on Manalokam – Latest Telugu News & Updates.