
తెలుగు ప్రేక్షకులకు రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివ రెడ్డి పాత్రతో మంచి గుర్తింపు సంపాదించాడు రవి కిషన్ (Ravi Kishan). ఆ తరువాత కిక్ 2, సుప్రీమ్, సైరా వంటి చిత్రాలతో తన ప్రత్యేకమైన నటనను కొనసాగించాడు. ఇప్పుడు ఆయన మరోసారి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే పాపులర్ కోర్ట్‌రూమ్ కామెడీ సిరీస్ సీక్వెల్ ‘మామ్లా లీగల్ హై సీజన్ 2’ (Maamla Legal Hai Season 2).
ఏప్రిల్ 3, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సీజన్‌లో పాట్‌పర్‌గంజ్ జిల్లా కోర్టులో జరిగే విచిత్రమైన కేసులు, లాయర్ల సరదా సమస్యలు, హాస్యంతో కూడిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. రవి కిషన్ తన టైమింగ్‌తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా చూపిస్తూ సిరీస్‌కు హైలైట్‌గా మారాడు.
రాహుల్ పాండే తెరకెక్కించిన ఈ సిరీస్ కోర్టులోని విచిత్రమైన కేసులను, లాయర్ల సరదా కష్టాలను చూపిస్తూ టాప్ ప్లేస్లో దూసుకెళ్తోంది. ఇందులో రవి కిషన్తో పాటుగా అంజుమ్ బాత్రా, నిధి బిష్త్, అనంత్ జోషి, నైలా గ్రేవాల్, కుషా కపిల, అమిత్ విక్రమ్ పాండే, విక్రమ్ ప్రతాప్ ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
Chalein Patparganj? 🛺 Court ki date aagyi hai ‼️#MaamlaLegalHaiOnNetflix pic.twitter.com/9tmmQbbtaj
— Netflix India (@NetflixIndia) April 3, 2026
కథేంటంటే:
ఈ సిరీస్ ఢిల్లీలోని కల్పిత పట్పర్‌గంజ్ సెషన్స్ కోర్టు నేపథ్యంలో సాగుతుంది. మొదటి సీజన్‌లో లాయర్‌గా ఉన్న వీడీ త్యాగి (రవి కిషన్) రెండో సీజన్‌లో జడ్జిగా అపాయింట్ అవుతాడు. చట్టం పట్ల తనకున్న అవగాహనతో, నైతిక విలువలతో తీర్పులు ఇస్తుంటాడు.
మరోవైపు కోర్టు ఆవరణలోని ఒక చిన్న చాంబర్‌లో సర్దుకుపోవడానికి లాయర్లు లఖ్మీర్ మింటు (అంజుమ్ బాత్రా), సుజాత నేగి (నిధి బిష్త్), విశ్వాస్ పాండే (అనంత్ జోషి) పడే ఇబ్బందులు నవ్వులు తెప్పిస్తాయి.
అనన్య (నైలా గ్రెవాల్) అన్యాయానికి గురైన వ్యక్తుల తరపున ఫ్రీగా కేసులు వాదిస్తూ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. అయితే.. ఆమెకు పోటీగా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న నైనా అరోరా (కుషా కపిల) వస్తుంది.
ఈ క్రమంలో వాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? జడ్జిగా వీడీ త్యాగి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది? తెలియాలంటే సిరీస్ చూడాలి.
విశ్లేషణ:
దర్శకుడు రాహుల్ పాండే ఈ సీజన్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా తీర్చిదిద్దాడు. కోర్ట్ డ్రామాను పూర్తిగా సీరియస్‌గా కాకుండా హాస్యంతో మేళవించడం ఈ సిరీస్ ప్రధాన బలం. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త కేసు, కొత్త హాస్య సన్నివేశాలు ఉంటాయి. లీగల్ సిస్టమ్‌లోని లోపాలను సేటైరికల్‌గా చూపించారు. ఎమోషనల్ మోమెంట్స్ కూడా సరిగ్గా ప్లేస్ చేశారు.
రవి కిషన్ జడ్జిగా అద్భుతమైన టైమింగ్‌తో పాటు భావోద్వేగాలను పండించారు. స్క్రీన్‌ప్లే వేగంగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. డైలాగ్స్ హాస్యాన్ని తెప్పించాయి. ఓవరాల్గా ఈ సీజన్2.. కామెడీతో కూడిన లైట్ కోర్ట్ డ్రామా కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా బలంగా నిలిచిన ఈ సిరీస్ OTT ప్రేక్షకులకు మంచి టైమ్‌పాస్ కంటెంట్.