Reading Time: < 1 minute

ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేవాళ్లకు గుడ్ న్యూస్.. ఆఫ్లైన్లోనూ రీల్స్ చూడొచ్చు !

Caption of Image.

ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్ చూసేవాళ్లకు కొత్త అప్​డేట్ వచ్చింది. సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా వీడియో లేదా రీల్ చూస్తున్నప్పుడు సిగ్నల్ సరిగా లేకపోతే అది లోడ్ అవుతూ ఉంటుంది. ఎక్కువసేపు లోడింగ్​లో ఉంటే చాలా చిరాకుగా అనిపిస్తుంటుంది. అయితే ఈ ప్రాబ్లమ్​కు త్వరలోనే సొల్యూషన్ తీసుకురానుంది మెటా కంపెనీ. దీంతో ఆఫ్​లైన్​లో కూడా రీల్స్ చూసుకోవచ్చట. ప్రస్తుతం టెస్టింగ్​ దశలో ఉన్న ఈ ఫీచర్​ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇన్​స్టాగ్రామ్​ ఇప్పుడు ఆటోమెటిక్​ డౌన్​లోడ్ సిస్టమ్​పై పనిచేస్తోంది.

ఇది మీ ఆసక్తికి తగ్గట్టుగా కొన్ని రీల్స్ను ముందే డౌన్​లోడ్ చేసి ఉంచుతుంది. దీంతో డేటా లేనప్పుడు కూడా వాటిని మీరు చూడొచ్చు. ఈ కొత్త అప్​డేట్​లో యూజర్లకు కంప్లీట్​ కంట్రోల్ ఇచ్చేలా ఆప్షన్లను ఇన్​స్టాగ్రామ్​ డిజైన్ చేసింది. అలాగే వైఫై ఆన్​లో ఉన్నప్పుడు రీల్స్​ను ఆటోమెటిక్​గా సేవ్ చేసే ఆప్షన్​ ఉంటుంది. 

అయితే ఇలా ఆటోమెటిక్​ డౌన్​లోడ్స్ వల్ల స్టోరేజీ నిండిపోతుంది అనిపించొచ్చు. అలాంటి భయం అక్కర్లేదు. ఎన్ని వీడియోలు డౌన్​లోడ్ చేయాలనేది ముందుగానే సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే యూట్యూబ్, నెట్​ఫ్లిక్స్​లో ఇలాంటి స్మార్ట్​ డౌన్​ లోడ్స్ ఫీచర్స్ వాడుతున్నారు. ఇది కూడా అలాంటిదే. దీని గురించి ప్రస్తుతానికైతే అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు.

©️ VIL Media Pvt Ltd.