
ఐపీఎల్ 19లో భాగంగా శనివారం (ఏప్రిల్ 4) గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ దూరమయ్యాడు. కండరాల నొప్పి కారణంగా అతడు ఈ మ్యాచ్ ఆడలేదు.
దీంతో గిల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గుజరాత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కండరాల నొప్పి వల్ల జీటీ రెగ్యులర్ కెప్టెన్ శుభమన్ గిల్ రాజస్థాన్‌తో మ్యాచుకు దూరంగా ఉన్నాడని టాస్ సందర్భంగా చెప్పాడు రషీద్ ఖాన్. త్వరలోనే అతను తిరిగి జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
►ALSO READ | IPL 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్.. కెప్టెన్నే మార్చేసిన గుజరాత్
టీమిండియా సారథి గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఓటమితో ఈ సీజన్‌ను ఆరంభించింది. సీజన్ తొలి మ్యాచులోనే పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది గుజరాత్. దీంతో సొంత వేదికలో రాజస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచులో విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, ఫామ్‌లో ఉన్న కెప్టెన్ గిల్ గాయం కారణంగా ఈ మ్యాచుకు దూరం కావడం జీటీకి ఎదురు దెబ్బగా మారింది.