
ఇరాన్ నుంచి తాజాగా అమెరికాకు ఘాటైన స్పందన
ట్రంప్ తీవ్ర హెచ్చరికలను ఆదివారం ఇరాన్ మరింత ఘాటుగా తోసిపుచ్చింది. ఇక ట్రంప్ అమెరికా సేనలకు నరక ద్వారాలు తెరుచుకుంటాయని ట్రంప్ పరిభాషలతోనే స్పందించారు. ఇరాన్ సైన్యం తరఫున జనరల్ అలీ అబ్దుల్లాహి అల్లాబాది ప్రకటన వెలువడింది. అమెరికా ఖంగు తినే రీతిలో తమ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ వ్యవస్థలపై ఎటువంటి దాడి జరిగినా తమ ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని, గల్ఫ్‌లోని సైనిక ఆయుధ స్థావరాలపై దాడులు కొనసాగుతాయని, ఇక మరింత శక్తివంతం అవుతాయని తెలిపారు. నిర్ణీత లక్షాలను ఎంచుకుని సాగే ఈ దాడులు శత్రువు విస్తుపోయేవిగా ఉంటాయని , ఈ దిశలో కార్యాచరణ సిద్ధం అయిందని వెల్లడించారు. శత్రువును ఏ విధంగా దెబ్బతీయాలనేది తమకు తెలుసునని, అమెరికా చెపుతున్న విధంగా సత్వర బలీయ దాడులకు అక్కడి సైనిక బలగాలు సిద్ధంగా లేవని, నిర్ణయాత్మక దిశలో ముందుకు వెళ్లలేరని, ఇప్పటి పరిణామాలతో ఈ విషయం గుర్తించామని తెలిపారు. అసమగ్ర అపసవ్య దాడుల బలహీనతతో శత్రువు కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ఎప్పుడూ పైచేయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.