Reading Time: < 1 minute
Raakaasaa Movie Day 1 Box Office Collections Report Niharika Konidela

యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా, నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘రాకాస’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనస్వాగతం అందుకుంది. హారర్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమాకు యూత్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, మొదటి రోజే ఈ చిత్రం తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీనుల కామెడీ ట్రాక్ థియేటర్లలో నవ్వులు పూయించగా,అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హారర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. ఇక..

Also Read : Rashmika: హిస్టరీ క్రియేట్ చేసిన రష్మిక మందన్న.. వరుసగా రెండోసారి జపాన్ నుంచి పిలుపు!

తాజా ట్రేడ్ లెక్కల ప్రకారం, ‘రాకాస’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 5.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో ఇండియాలో ప్రదర్శించిన పెయిడ్ ప్రీమియర్స్ వసూళ్లు కూడా కలిసి ఉన్నాయి. ఒక చిన్న సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం విశేషం. చెప్పాలంటే నిహారిక కొణిదెల టీమ్ చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అంతే కాదు బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉంది. మంచి మౌత్ టాక్ రావడంతో వీకెండ్ నాటికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే మరో రూ. 12 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.