Reading Time: < 1 minute

వాషింగ్టన్: ఇరాన్ పై మరోసారి అమెరికా భీకర దాడులతో విరుచుకుపడింది. టెహ్రాన్‌పై దాడి చేశామని.. దీంతో పలువురు ఇరాన్ సైనిక అధికారులు మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. టెహ్రాన్‌లో జరిగిన భారీ దాడితో ఇరాన్ సైనిక నాయకులలో చాలా మంది అంతమయ్యారని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ అనంతర దాడికి సంబంధించిన ఒక వీడియోను ట్రంప్ పంచుకున్నారు.

ఏప్రిల్ 6వ తేదీలోగా ఒప్పందం కుదుర్చుకోవడమో లేదా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమో చేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరించారు. తాను విధించిన గడువును గుర్తుచేస్తూ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి తీవ్రంగా హెచ్చరించిన కొన్ని గంటలకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, అంతకుముందు ట్రంప్ అల్టిమేటమ్‌ను ఇరాన్ తిరస్కరించింది. ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ కేంద్ర సైనిక నాయకత్వం నిరాధారమైనదిగా, అనుచితమైనదిగా కొట్టిపారేసింది. ట్రంప్ వ్యాఖ్యలను బలహీనతకు, అస్థిరతకు సంకేతమంటూ విమర్శించింది.