Reading Time: < 1 minute

బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

Caption of Image.

దేశ చరిత్రలోనే లాంగెస్ట్ టైం పని చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. 2026 ఏప్రిల్ 05న హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందరు బాబు జగజీవన్ రామ్ చరిత్ర చదవాలని సూచించారు. దళిత హక్కుల కోసం పోరాటం చేసారని గుర్తు చేశారు.

ఇందిరా గాంధీ కాబినెట్ లో రైతులకు న్యాయం చేయాలనీ పని చేసిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు మంత్రి వివేక్. దళితుల కోసం 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుతామని ఈ సందర్భంగా అన్నారు. దళితులకు ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సహకరిస్తామని తెలిపారు. దళితులు చాలా మంది తమకు స్కీమ్స్ వస్తలేవుని చెప్తున్నారు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. 

ఈ సందర్భంగా మరో  మంత్రి అడ్లూరి లక్షణ్ మాట్లాడుతూ.. దళిత వర్గాలకు మేలు జరిగే విధంగా అండగా ఉంటామన్నారు. తమిళనాడు లో ఉన్నట్లు అంబేడ్కర్ నాలెడ్జి టవర్ ఏర్పాటు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వచ్చినట్లు తెలిపారు. 10 అంతస్తులకు తగ్గకుండా నిర్మాణం చేసుకుందామని చెప్పారు. బాబు జగ్ జీవన్ రామ్ పేరుతో విద్యార్థుల కోసం హాస్టల్ నిర్మాణం చేస్తామన్నారు. 

మాజీ గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ..  దళిత వర్గాల నుంచి కేంద్ర మంత్రి అయిన నాయకుడు బాబు జగ్ జీవన్ రామ్ అని కొనియాడారు. మాల, మాదిగ నాయకులు ఒకే వేదిక మీదకు రావడం సంతోషకరమైన విషయం అన్నారు. 

మంత్రులు దామోదర్ రాజా నర్సింహా, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే నాగరాజు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ,  కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు తదితరులు జయంతి వేడుకలకు హాజరయ్యారు. జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నాయకులు.

©️ VIL Media Pvt Ltd.