Reading Time: < 1 minute

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలని తాపత్రయ పడుతోంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు:

సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీరె్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.

ఆర్‌సిబి: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడికల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ.