
బెంగళూరు: ఐపిఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ సిబి 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. చెన్నై ముందు 251 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఉంచింది. టిమ్ డేవిడ్ దేవదూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. ఆర్ సిబి బ్యాట్స్ మెన్లలో టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు, రజత్ పటిదార్ 48 బంతుల్లో 48 పరుగులు, దేవదూత్ పడిక్కల్ 29 బంతుల్లో 50 పరుగులు, విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 30 బంతుల్లో 46 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, జెమీ ఓవర్టన్, శివమ్ దూబే తలో ఒక వికెట్ తీశారు.