
బుషెహర్ లోని ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడంపై ఆ దేశ రక్షణ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. బుషెహర్లోని అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా దాడి చేయడం ఇది నాల్గొ సారి. అణు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమై రేడియేషన్ విస్తరిస్తే ముందుకు ప్రభావం చూపేది గల్ప్ దేశాలపైనే.. టెహ్రాన్ పైనా కాదు అని హెచ్చరించారు అరాఘ్చీ.
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ పాశ్చాత్య దేశాల దురాక్రమణపై Xలో ఓ పోస్ట్ షేర్ చేశారు అరాఘ్చి. ఉక్రెయిన్ లోని జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో రష్యా దాడులు జరిపినప్పుడు ప్రజాగ్రహాన్ని చూశాయంటూ రాశారు. “ఇజ్రాయెల్-అమెరికా ఇప్పటికి మా బుషెహర్ ప్లాంట్‌పై నాలుగు సార్లు బాంబు దాడి చేశాయి. ఒకేవేళ రేడియేషన్ విస్తరిస్తే అది గల్ఫ్ సహకార మండలి (GCC) రాజధానులలో జీవరాశిని అంతం చేస్తుంది.. టెహ్రాన్‌లో కాదు. అని అరాఘ్చి రాశారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యల వెనక కీలకమైన భౌగోళిక వాస్తవాన్ని లేకపోలేదు. అదేమిటంటే ఓడరేవు నగరంగా బుషెహర్ ఇరాన్ రాజధాని నగరమైన టెహ్రాన్ కంటే దాని పొరుగున ఉన్న అరబ్ దేశాలు రేడియేషన్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.ఐక్యరాజ్యసమితికి రాసిన ఇలాంటి లేఖలోనే విద్యుత్ ప్లాంట్‌పై జరిగిన దాడుల కారణంగా తీవ్రమైన రేడియేషన్ ప్రమాదం ఉందని ఇరాన్ హెచ్చరించింది.
బుషెహర్ లోని అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా, ఇజ్రాయెల్ పదే పదే దాడులు చేస్తు్న్నాయి. అణు విద్యుత్ కేంద్రం ధ్వంసమైతే వచ్చే రేడియేషన్ తో మానవ, పర్యావరణానికి తీవ్రనష్టం తప్పదని ఐక్యరాజ్యసమితికి అరాఘ్చి లేఖ రాశారు.
►ALSO READ | హార్మూజ్ తెరవండి రా పిచ్చి వెదవల్లారా.. లేకపోతే నరకానికి పోతరు: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
శనివారం అమెరికా, ఇజ్రాయెల్ నాలుగోసారి బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా దాడులు చేశాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం.. క్షిపణి దాడిలో అణువిద్యుత్ కేంద్రం సమీపంలో ఒకరు మృతి చెందారు. ఇరాన్ విద్యుత్ ప్లాంట్‌పై జరిగిన దాడి అనంతరం IAEA డైరెక్టర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..అణు స్థావరాలు దాని సమీప ప్రాంతాలపై ఎప్పుడూ దాడి చేయకూడదని హెచ్చరించింది.