Reading Time: < 1 minute

ఐపీఎల్‌ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ గెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ(0), ట్రావిస్ హెడ్(7)ల తోపాటు కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ఔట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్ హెచ్ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగస్టన్(14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్ 9 ఓవర్లలో 31 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెస్(5), నితీష్ కుమార్ రెడ్డి(3)లు ఉన్నారు.