Reading Time: < 1 minute

విద్యుత్ కేంద్రాలు, పెట్రోకెమికల్ కేంద్రం ధ్వంసం

ఇరాన్ ఆదివారం జరిపిన డ్రోన్ దాడులలో కువైట్‌కు చెందిన ఓ విద్యుత్ కేంద్రం, ఒక పెట్రోకెమికల్ స్థావరం దెబ్బతింది. ఒక జల శుద్ధి కర్మాగారాన్ని కూడా పనికి రాకుండా చేశారు. కువైట్‌లోని షువైఖ్ చమురు సెక్టార్ కాంప్లెక్స్‌లో కూడా డ్రోన్ దాడి జరిగింది. దీనితో మంటలు చెలరేగాయి. ఈ కాంప్లెక్స్‌లో చమురు మంత్రిత్వశాఖ, కువైట్ పెట్రోలియం ప్రధాన కార్యాలయం ఉన్నాయి. . ఈ విషయాన్ని కువైట్ విద్యుత్ మంత్రిత్వశాఖ కూడా నిర్థారించింది. . ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అరబ్ ఏమిరేట్స్‌లో బోరోగ్ పెట్రోకెమికల్ ప్లాంట్‌ను ఇరాన్ దెబ్బతీసింది. ఈ క్రమంలో ఆదివారం చెలరేగిన మంటలను తమ సహాయక బృందాలు అదుపులోకి తీసకువచ్చాయని ఏమిరేట్స్ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాకు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న యుఎఇకి చెందిన రువైస్ ఇంధన ప్లాంట్‌లో పని నిలిచిపోయింది. పలు గల్ఫ్ దేశాలలో పెట్రో కెమికల్ పరిశ్రమ అత్యంత కీలకమైన ఆర్థిక వనరుగా ఉంది. బహరైన్, యుఎఇ, ఇరాన్‌లలో ఈ యూనిట్లలోనే చమురు, సహజవాయువులను ప్లాస్టిక్స్, పాలిమిర్స్‌తో పాటు ఎరువులుగా మారుస్తారు. దీనితోనే ఎటా బిలియన్ డాలర్లలో ఎగుమతి ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఇరాన్ తమ పెట్రోకెమికల్ యూనిట్స్‌ను శత్రుదాడుల నుంచి రక్షించుకుంటూనే గల్ఫ్ దేశాలలోని కీలక విభాగాలపై దాడులకు దిగుతోంది.