
కూలిపోయిన అమెరికా విమానం పైలట్ ను రక్షించామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ఖాతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఇస్ఫాహన్ దగ్గర యూఎస్ రెస్క్యూ ఆపరేషన్ పూర్తిగా విఫలమైందని, -ఓటమి నుంచి తప్పించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు మానసిక యుద్ధం చేస్తున్నాన్నారని ఖాతమ్ అల్-అన్బియా హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి అన్నారు.
‘‘విఫలమైన అమెరికా అధ్యక్షుడు ఆందోళనతో నిజాయితీ లేకుండా తనకు అలవాటైన నిరాధారమైన వాదనలు ,నిందారోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే, మానసిక యుద్ధం ద్వారా తన ఓటమి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని’’ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి సోషల్ మీడియాలో X లో రాశారు.
►ALSO READ | నేపాల్ లో పెట్రోల్ కష్టాలు..వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్ సోషల్’ ద్వారా స్పందిస్తూ..తమ పైలట్‌ను విజయవంతంగా రక్షించామని (“WE GOT HIM!”) ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన సైనిక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెపుతోందని, ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించే మానసిక యుద్ధం అని ఆయన విమర్శించారు.
దక్షిణ ఇస్ఫాహన్‌లో కూలిపోయిన అమెరికా పైలట్‌ను రక్షించేందుకు యుఎస్ సైన్యం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైందని, ఈ క్రమంలో రెండు అమెరికా C-130 రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది.
Spokesperson for the Khatam al-Anbiya Central Headquarters stated that the failed US president, acting frantically and dishonestly, is trying to flee his defeat through psychological warfare, while persisting with his usual groundless claims and blame-game.
— IRNA News Agency ☫ (@IrnaEnglish) April 5, 2026