
Shreyas Iyer Angry Video: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో పంజాబ్ కింగ్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరలో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు దాడి చేయడంతో పంజాబ్ బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోయాడు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే అయ్యర్, మైదానంలో విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్‌పై అయ్యర్ ఫైర్..
చెన్నై ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసేందుకు విజయ్‌కుమార్ వైశాఖ్‌ను అయ్యర్ ఆహ్వానించాడు. అప్పటికే సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో పాతుకుపోయి బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. వైశాఖ్ వేసిన బంతులను సర్ఫరాజ్ సునాయాసంగా బౌండరీలకు తరలించడంతో అయ్యర్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బౌలింగ్ లైన్ అండ్ లెంగ్త్ తప్పడం, ఫీల్డర్ల సమన్వయ లోపంపై అయ్యర్ అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా అరిచాడు. ముఖ్యంగా సర్కిల్ లోపల ఉన్న ఫీల్డర్ వైపు చూస్తూ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే అదే ఓవర్లో సర్ఫరాజ్ వికెట్ పడటంతో పంజాబ్ ఊపిరి పీల్చుకుంది.
ఇది కూడా చదవండి: కాటేరమ్మ కొడుకు పొగరు ఠక్కున దించేశారుగా.. ఇదే రిపీటైతే బ్యాన్.!
పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం..
— crictalk (@crictalk7) April 4, 2026
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ అద్భుత పోరాటాన్ని కనబరిచింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కేవలం 11 బంతుల్లో 39 పరుగులు చేసి శుభారంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడి 29 బంతుల్లో 50 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరిలో శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
తదుపరి పోరు కోల్‌కతాతో..
వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్, తమ తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ పోరు జరగనుంది. ప్రస్తుతం పంజాబ్ రెండు విజయాలతో పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, కోల్‌కతా వరుస ఓటములతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని పంజాబ్ భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..