Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలపై దాడులు జరగడం సిగ్గుచేటని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ముమ్మాటికి ఇది ప్రజాస్వామ్యంపై  సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చేయించిన దాడి జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫొటో పెట్టి, కాంగ్రెస్ అనుకూలంగా నినాదాలు చేశారని విమర్శించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని డిమాండ్ చేశారు. క్యాంపు ఆఫీసుపై దాడులు చేస్తుంటే శాంతిభద్రతలు ఉన్నట్టా.. లేనట్టా? క్యాంపు కార్యాలయంపై దాడిని పోలీసులు ఎందుకు అడ్డుకోవట్లేదు? హరీశ్ రావు ప్రశ్నించారు. సిఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు చేస్తూ.. పాలనను గాలికి వదిలేశారా? బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆఫీసులపై దాడులు చేయాలని సందేశాలు ఇచ్చారా? అని నిలదీశారు. క్యాంపు ఆఫీసుపై దాడులు జరిపిన వారిని గుర్తించి వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని హరీశ్ రావు కోరారు.