
మల్కాజ్‌గిరి పోలీసులు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 13మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేశారు. నిందితులు పెట్టుబడులు, డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని బెదిరించడంతో మల్కాజ్‌గిరి సైబర్ క్రైం పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. వారి కోసం ప్రత్యేంగా ఏర్పాటు చేసిన టీంలు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ఆపరేషన్‌లో ఆరు కేసుల్లో 13మందిని అరెస్టు చేశారు. పెట్టుబడుల నేరాలు ఐదు, డిజిటల్ అరెస్టు ఒక కేసులో 13మంది నిందితులుగా ఉన్నారు. సైబర్ క్రైం బాధితులకు మల్కాజ్‌గిరి పోలీసులు రూ.15,61, 728 రీఫండ్ చేశారు. ప్లస్ గ్లోబల్ పేరుతో నిందితులు బాధితుడితో రూ.2,50,000 పెట్టుబడిపెట్టించి మోసం చేశారు.
బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఖమ్మం జిల్లాకు చెందిన ఎకే అక్బర్‌ను అరెస్టు చేశారు. నకిలీ ట్రేడింగ్‌యాప్‌తో అధిక లాభాలు వస్తాయని చెప్పి బాధితుడి వద్ద నుంచి రూ.61,90,000 కోట్టేశారు. రూ.9,85,24,793 లాభాలు వచ్చాయని చూపించిన నిందితులు వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు మరింత పెట్టుబడిపెట్టాలని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు మల్కాజ్‌గిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు మాన్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఇలా వివిధ కేసుల్లో 13మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.