Reading Time: < 1 minute

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 19వ సీజన్‌తో ఈ రోజు మొదటి డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ప్రత్యర్థఉలపై విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ అదే జట్టును కొనసాగిస్తుండగా.. ముంబై పలు మార్పులు చేసింది. కెప్టెన్సీ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించిన ముంబై.. హార్థిక్ స్థానంలో దీపక్ చాహర్, బోల్ట్ స్థానంలో కార్బిన్ బాష్, అల్లాహ్ జఫన్‌ఘర్ స్థానంలో శాంట్నర్‌ని జట్టులోకి తీసుకుంది.