
Shaheen-III vs Agni-V: భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు పాకిస్థాన్ వణికిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ ఏవైనా కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చు. ఒకవేళ అదే జరిగితే.. భారత ప్రతిస్పందన ఊహించని రీతిలో నిర్ణయాత్మకంగా ఉంటుందని బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉరి సెక్టార్ దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సిందూర్ లాంటి దాడులను గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యల అనంతరం పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిచ్చి కూతలు కూశారు. ఒకవేళ భారత్ పాకిస్థాన్ యుద్ధం వస్తే తాము కేవలం సరిహద్దులకే పరిమితం కామని.. ఏకంగా కోల్‌కతాను కూడా లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ పాకిస్థాన్ ఇంత పెద్ద వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఆ దేశం వద్ద ఉన్న ఓ క్షిపణి. ఆ క్షిపణి పేరే ‘షాహీన్-III’ (Shaheen-III). ఈ పాక్ క్షిపణితో పాటు భారత్ వద్ద ఉన్న డేంజరెస్ ‘అగ్ని-5’ (Agni-V) గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
READ MORE: Hyderabad: హైకోర్టు జోన్-2 పనులకు శంకుస్థాపన..!
పాకిస్థాన్‌కు ఇంత ధైర్యం ఇచ్చిన మిస్సైల్ ఏది?
ఇక పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్ నుంచి కోల్‌కతాకు గగనతల దూరం సుమారు 1700 కిలోమీటర్లు కాగా, రోడ్డు మార్గంలో ఇది 2000 కిలోమీటర్లకు పైమాటే. ఇంత సుదూరంలో ఉన్న భారత నగరాన్ని తాము సులభంగా లక్ష్యంగా చేసుకోగలమని, అందుకు అవసరమైన ఆయుధ సంపత్తి తమ వద్ద ఉందని పాక్ బీరాలు పలుకుతోంది. ప్రధానంగా పాకిస్థాన్ అమ్ములపొదిలోని బాలిస్టిక్ క్విపణి ‘షాహీన్-III’ (Shaheen-III) క్షిపణిని ఉద్దేశించే ఈ బెదిరింపులకు దిగుతోంది. ఈ క్షిపణి సామర్థ్యం 2750 కిలోమీటర్లు. 2015లో తొలిసారి పరీక్షించిన ఈ క్షిపణి, ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఘన ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణిని రోడ్డుపై ప్రయాణించే మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ఇది కేవలం కోల్‌కతా మాత్రమే కాదు.. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పాటు అండమాన్ నికోబార్ దీవులను కూడా తాకగలదు. భారత్ మొత్తాన్ని తన పరిధిలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా పాక్ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది.
భారత్‌తో ఉన్న క్షిపణుల సామర్థ్యం ఇదే..
పాకిస్థాన్ ఈ స్థాయిలో బెదిరింపులకు దిగడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం భారత్‌ను వ్యూహాత్మకంగా నిలువరించడమే. అయితే, పాక్ క్షిపణుల కంటే భారత్ వద్ద ఉన్న ‘అగ్ని-5’ (Agni-V) వంటి క్షిపణులు అత్యంత శక్తివంతమైనవి. ఇవి 7000 కిలోమీటర్లకు పైగా ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలవు. అంతేకాకుండా, భారత్ వద్ద ఉన్న అత్యాధునిక మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ (Air Defense Systems), పాక్ క్షిపణులను అవి ప్రయోగించిన తొలి దశలోనే గగనతలంలోనే కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు గాలిలో దీపాల్లాంటివే అయినా, తూర్పు భారతంపై వారు కన్నేయడం రక్షణ రంగ నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు.