Reading Time: < 1 minute

IPL 2026: టాస్ గెలిచిన చెన్నై.. ఆర్సీబీదే ఫస్ట్ బ్యాటింగ్

Caption of Image.

ఐపీఎల్ 19లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్‎లో మోస్ట్ పాపులర్ టీమ్స్ అయినా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తలపడనున్నాయి. బెంగళూర్‎లోని చినస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో చెన్నై టాస్ గెలిచింది. దీంతో సేఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. 

హోమ్ గ్రౌండ్‎లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లు సేమ్ టీములతోనే బరిలోకి దిగాయి. రాత్రి 7.30 గంటలకు ఈ రసవత్తరపోరు షురూ కానుంది. సన్ రైజర్స్ హైదరాబాద్‎పై ఘన విజయంతో టోర్నీని ఆరంభించిన ఆర్సీబీ గెలుపు జోష్‎లో బరిలోకి దిగగా.. ఈ సీజన్‎‎లో ఆడిన రెండు మ్యాచులు ఓడి చెన్నై తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి టోర్నీలో బోణీ కొట్టాలని భావిస్తోంది. 

జట్లు:

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), రుతురాజ్ గైక్వాడ్(c), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్

►ALSO READ | IPL 2026: పంత్ పంజా.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ

©️ VIL Media Pvt Ltd.