Reading Time: < 1 minute
Instagram Love Tragedy Young Woman Dies After Suicide Attempt In Krishna District

Instagram Love Tragedy: కృష్ణా జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన ప్రేమ ఒక యువతి ప్రాణాన్ని బలి తీసుకున్న విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నం గొడుగు పేటకు చెందిన ఓ యువతి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం ప్రకారం, సదరు యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే, అతని చేత మోసపోయినట్లు భావించిన యవతి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ స్పందన ప్రాణాలు విడిచింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇనుగుదురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా ద్వారా ఏర్పడే సంబంధాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, భావోద్వేగాలకు లోనవకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Read Also: Chandigarh Blast: బీజేపీ ఆఫీస్ పేలుడు ఘటన వెనక పాక్ ఐఎస్ఐ హస్తం.. ఐదుగురు అరెస్ట్..