Reading Time: < 1 minute

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం విందు.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

భారత సర్వోన్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. శంషాబాద్‌లోని హోటల్ నోవాటెల్‌లో శనివారం(ఏప్రిల్ 4)  రాత్రి ప్రభుత్వం తరపున అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం  రేవంత్ రెడ్డి హాజరై, జస్టిస్ సూర్యకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తగిన గౌరవ మర్యాదలను కల్పించడంలో సీఎం స్వయంగా పర్యవేక్షించారు.

ఈ విందు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ,ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థ ,కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య పరస్పర గౌరవాన్ని చాటిచెప్పేలా ఈ భేటీ సాగింది.

►ALSO READ | ఆల‌యాల ప‌రిస‌రాల్లో నో పాలిటిక్స్.. తిరుమ‌ల త‌ర‌హాలో రూల్స్: సీఎం రేవంత్

©️ VIL Media Pvt Ltd.