Reading Time: < 1 minute

మ్యాథ్య్ మాస్టర్ గా జనగామ కలెక్టర్

Caption of Image.

జనగామ అర్బన్/ రఘునాథపల్లి (లింగాలఘనపూర్)​, వెలుగు: తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాష్ట్ర ఎలక్టోరల్ అధికారి సీ.సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా పాల్గొన్నారు. రాష్ట్ర ఎలక్టోరల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. 

ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఏఈఆర్వో, ఈఆర్వో స్థాయిలో ఐటీ హెల్ప్‌‌‌‌డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్​ లింగాల ఘనపూర్​ మండలం బండ్లగూడెం కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతులు, రికార్డులు పరిశీలించారు. టెన్త్​ విద్యార్థులకు స్వయంగా గణిత బోధన చేశారు. కిచెన్​ను సందర్శించి సరుకులను  పరిశీలించారు.  

©️ VIL Media Pvt Ltd.