మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు వ్యయ స్థానంలో అస్తంగత్వం దోషం వల్ల బలహీన పడడం వల్ల కొద్ది కాలంగా ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం సద్వినియోగం కావడం జరుగుతుంది. శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
సింహం: ఈ రాశికి అష్టమ శని దోషం కలిగినందువల్ల కొద్ది కాలంగా అనుభవిస్తున్న కష్టనష్టాల నుంచి ఈ రాశివారికి శని అస్తంగత్వం వల్ల విరామం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం, రాజపూజ్యాలు కలగడం, విదేశీ అవకాశాలు లభించడం, అనారోగ్యాలు తగ్గిపోవడం, రావాల్సిన డబ్బు రావడం, ప్రాధాన్యం పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శని అస్తంగతుడు అవడం వల్ల వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు.
ధనుస్సు: అర్ధాష్టమ శని కారణంగా అష్టకష్టాలను అనుభవిస్తున్న ఈ రాశివారికి శని అస్తంగత్వం వల్ల కీలక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖ శాంతులు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. ప్రస్తుతం ఆ శని అస్తంగతుడైనందు వల్ల ఈ రాశివారి ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాలు, ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లబ్ధి పొందడం జరుగుతుంది. ఉద్యోగంలో సాఫల్యాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. అయితే, శని అస్తంగత్వం వల్ల ఈ ఏలిన్నాటి శని దోషం బాగా బలహీనపడింది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. పదో న్నతి లభించే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులు, బంధువుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అనారోగ్య సమస్యలు బాగా తగ్గుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆశించిన స్థాయిలో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.





