
Ashok Sharma: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒక సరికొత్త “స్పీడ్ గన్ బౌలర్” పుట్టుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టులో ఆడుతున్న 23 ఏళ్ల యువ పేసర్ అశోక్ శర్మ, శనివారం నాడు అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అశోక్ ఏకంగా 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి, ఈ సీజన్ లోనే అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. దీనితో అన్రిచ్ నోర్కియా పేరిట ఉన్న రికార్డును అతను అధిగమించాడు.
GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..
అశోక్ కేవలం ఒక్క బంతితోనే కాకుండా.. తన స్పెల్ మొత్తం నిలకడగా వేగాన్ని నమోదుచేశారు. 16వ ఓవర్ చివరి బంతికి 154.2 కిమీ వేగాన్ని అందుకోవడానికి రెండు బంతుల ముందే, అతను 150.7 కిమీ వేగంతో మరో బుల్లెట్ లాంటి బంతిని విసిరి ఆశ్చర్యపరిచాడు. కేవలం వేగమే కాకుండా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం చూపుతున్నాడు అశోక్ శర్మ. లైన్ అండ్ లెంగ్త్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది.
SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ యువ మీడియం పేసర్ ప్రయాణం వివిధ రకాలుగా సాగింది. మొదట రాజస్థాన్ రాయల్స్ క్యాంప్ లో నెట్ బౌలర్‌గా ఉంటూ స్టార్ ఆటగాళ్ల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 2022 ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇతని ప్రతిభను గుర్తించి రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. ఆపై 2025లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన అశోక్, 2026 వేలంలో రూ. 90 లక్షల భారీ ధరతో గుజరాత్ టైటాన్స్ జట్టులోకి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 టీ20 మ్యాచ్ లలో 33 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 4 మ్యాచ్ లలో 14 వికెట్లు, లిస్ట్-Aలో 7 మ్యాచ్ లలో13 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గుజరాత్ పై విజయం సాధించి టేబుల్ టాపర్ గా నిలిచింది.