
బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ, బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ప్రగతినగర్ లోని ప్లాట్ నెంబర్ 614, ఫ్లాట్ నెంబర్ 302 లో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పేకాట ఆడుతున్న సి. సందీప్ రెడ్డి, ఎం, ప్రశాంత్ రెడ్డి, ఎం. నారాయణరెడ్డి, డి. మహేష్ కుమార్, జి, ఆదిరెడ్డి, జి. మురళిక్రిష్ణలను పట్టుకుని స్టేషన్ కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ. 30, 350 నగదు, ఆరు సెల్ ఫోన్ల సీజ్ చేసి, ఆరుగురు వ్యక్తులపై సెక్షన్ 3, 4 టీఎస్ జీఏ యాక్టు కింద కేసు నమోదు చేసి, ఎస్సై ఎం. సాయి విఘ్నేష్ దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన పేకాటరాయులు రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులని తెలిసింది.