Reading Time: 2 minutes

Virat Kohli: ఆర్సీబీలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు.. నేనేమీ ఓవర్సీస్ ప్లేయర్ని కాదన్న కోహ్లీ

Caption of Image.

Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆట విషయంలోనే కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి అంశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణం క్రికెట్ మ్యాచులు లేనప్పుడు అతడు లండన్ లో నివాసం ఉండటమే. భారత జట్టు మ్యాచులు ఆడిన అనంతరం వెంటనే తన కుటుంబంతో కలిసి లండన్ కి వెళ్లిపోతుంటాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమయంలోనూ చాలా కండిషన్స్ పెట్టాడనే వార్త కథనాలు వచ్చాయి. మ్యాచులకు ఎక్కువ సమయం ఉన్నప్పుడు ప్రత్యేక విమానంలో లండన్ కి పంపించాలని కోరాడని.. దానికి ఆర్సీబీ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం కొనసాగింది. కానీ, వాటన్నింటినీ విరాట్ కొట్టిపడేశాడు. తాజాగా మిస్టర్ నాగ్స్ తో జరిగిన మరో చిట్ చాట్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు. 

మిస్టర్ నాగ్స్: బయట చాలా మంది ఆర్సీబీ ఐదుగురు విదేశీ ప్లేయర్లతో ఆడుతోంది అని పేర్కొంటున్నారు.. కానీ వారు ఎందుకు అలా పిలుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.. నీకేమైనా తెలుసా? అని క్వశ్చన్ చేశాడు. 

విరాట్ కోహ్లి: నాకు తెలియదు.. అయినా, ఆ క్వశ్చన్ నన్నెందుకు అడుగుతున్నావు? నేనేమీ ఓవర్సీస్ ఆటగాడిని కాదు.. నీకు అలా అనిపిస్తున్నానా? అందుకే, ఈ ప్రశ్నను ఏదైనా విదేశీ ఆటగాడిని అడుగు అని సూచించాడు..

►ALSO READ | IPL 2026: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..

దాదాపు 18 సంవత్సరాల తర్వాత తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొతం చేసుకుంది. అప్పటి వరకూ ఉన్న బరువు అంతా దిగిపోయినట్లు అనిపించిందని విరాట్ కోహ్లీ తెలిపారు. కఠోర శ్రమ, ఎన్నో త్యాగాల సమాహారానికి విజయం దక్కింది. ఆటపై అంకితభావం ప్రదర్శించాలి.. గెలుపు అనేది మీరు పడిన కష్టం, సమయం వృథా కాలేదని భరోసా కల్పిస్తుందని చెప్పాడు. చాలామంది ఓటముల నుంచి నేర్చుకుంటూ ఉంటారు.. అదే సమయంలో కొందరు నిరుత్సాహ పడతారు.. మనం కష్టపడిన దానికి న్యాయం జరిగిందంటే గెలిచినట్లే.. నిరంతరం శ్రమిస్తూనే ఉండాలని స్ఫూర్తి నింపుతుందని కింగ్ కోహ్లీ వెల్లడించారు. 

 

 

©️ VIL Media Pvt Ltd.