Reading Time: < 1 minute

సూర్య తన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయి లో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది. తాజాగా మేక ర్స్ ఈ సినిమా నుంచి గాడ్ మోడ్ సాంగ్ రిలీ జ్ చేశారు. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ పక్కా మాస్ ఎనర్జీతో ఊపేస్తూ, థియేటర్లలో విజిల్స్ పండించే డ్యాన్స్ నెంబర్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్‌లో సూర్య డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను మైమరపిస్తున్నాయి. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.