Reading Time: 2 minutes

IPL 2026: ఆర్సీబీ ఆల్ రౌండ్ షో.. చెన్నైపై 43 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ

Caption of Image.

IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (70), దేవదత్ పడిక్కల్ (50), రజత్ పాటిదార్(48), ఫిల్ సాల్ట్ ( 46), విరాట్ కోహ్లీ (28) అద్భుతమైన బ్యాటింగ్ చేయడంలో భారీ స్కోర్ చేసింది.

ఇక 251 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 19. 4 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే జట్టు టాపార్డర్ మరోసారి ఘోరంగా విఫలమైంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) మొదటి ఓవర్లోనే జాకబ్ డఫీ పెవిలియన్ కి పంపించగా, అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ మాత్రే(1)ని రెండో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. మూడో ఓవర్లో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ (9)ని డఫీ ఔట్ చేయడంతో డగౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో 30 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన *సర్ఫరాజ్ ఖాన్ (50) మెరుపు హాఫ్ సెంచరీతో  సీఎస్కే స్కోర్ బోర్డుని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించాడు. కానీ కృనాల్ పాండ్యా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి స్టంప్ ఔట్ కాగా, ఆ తర్వాత ఓవర్లలోనే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కార్తిక్ శర్మ (6) ఏమాత్రం ప్రభావం చూపించకుండానే  కృనాల్ బౌలింగ్ లోనే అభినందన్ సింగ్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో 84 పరుగులకే ఏకంగా 5 వికెట్లని నష్టపోయింది సీఎస్కే. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే వచ్చి రావడంతోనే ఫస్ట్ బంతిని మైదానం స్టాండ్స్ లోకి కొట్టి మంచి ఊపు మీద కనిపించినప్పటికీ, కేవలం 18 పరుగులు చేసి అభినందన్ సింగ్ బౌలింగ్ లో జితేష్ శర్మకి క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలి పెట్టి వెళ్లిపోయాడు దూబే. చివర్లో బ్యాటింగ్ కి వచ్చిన ప్రశాంంత్ వీర్, జేమీ ఓవర్టిన్ మధ్య 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

చివర్లో ప్రశాంత్ వీర్ దూకుడైన బ్యాటింగ్ తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. హాఫ్ సెంచరీ దిశగా కొనసాగుతున్న అతడ్ని భవనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. ఇక జేమీ ఓవర్టిన్ సైతం 37 పరుగులు చేసిన తర్వాత సుయాష్ శర్మ బౌలింగ్ లో పెవిలియన్ కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన నూర్ అహ్మద్ 8 పరుగులు చేసిన డగౌట్ కి వెళ్లిపోయాడు. లాస్ట్ ఓవర్లో అన్షల్ కాంబోజ్ బ్యాట్ ఝలిపించినప్పటికీ 207 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్  3వికెట్లు తీసుకోగా, జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, అభినందన్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, సుయాష్ శర్మ ఒకటి తీసుకున్నాడు. 

©️ VIL Media Pvt Ltd.