
భారత్ దౌత్యం ఫలించింది. హార్ముజ్ జలసంధి దాటి మరో ఎల్పీజీ నౌక ఇండియా వైపు పయనిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్దంలో ఏర్పడిన చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న క్రమంలో ఇప్పటివరకు ఆరు ఎల్పీజీ నౌకలు హార్ముజ్ ద్వారా పయనించేందుకు ఇరాన్ అనుమతించింది. శక్రవారం(ఏప్రిల్ 3) భారత్ పతాకంతో కూడిన ఏడో ఎల్పీజీ గ్యాస్ నౌక గ్రీన్ సాన్వి హార్ముజ్ జలసంధి దాటి స్వదేశం వైపు పయనిస్తోందని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ X లో పోస్ట్ చేసింది.
భారత్ తో ఇరాన్ ప్రత్యేక అనుబంధం ఉన్నది. ముఖ్యంగా గుజరాత్ కు ప్రత్యేకత ఉంది.శతాబ్దాల క్రితం ఇరాన్ నుంచి వచ్చిన మావాళ్లను భారత్ ఎంతో సాదరంగా ఆహ్వానించింది. స్నేహ సంబంధాలను,సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం అని ఇరాన్ పేర్కొంది. గ్రీన్ సాన్వీ ప్రయాణాన్ని భారత దౌత్యానికి విజయంగా అభివర్ణించిన గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి పోస్ట్ కు ప్రతిస్పందనగా ఇలా స్పందించింది ఇరాన్ కాన్సులేట్.
►ALSO READ | హైదరాబాద్ నుంచి వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్ ఆగే చెన్నై స్టేషన్ మారింది..!
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కీలక షిప్పింగ్ చోక్‌పాయింట్ హార్ముజ్ ను ఎల్పీజీ గ్యాస్ నౌక గ్రీన్ సాన్వి విజయవంతంగా దాటిందని సంఘవి X లో పోస్ట్ చేశారు. మరో నౌక ఈ మార్గాన్ని దాటడం భారతదేశానికి మరో దౌత్యపరమైన విజయమని ఆయన పోస్ట్ లో రాశారు. గ్రీన్ సాన్వి ప్రయాణంతో హోర్ముజ్ జలసంధిని 7 ఎల్‌పిజి ట్యాంకర్లతో సహా మొత్తం 8 భారతీయ నౌకలు దాటాయి. సుమారు 17 భారతీయ నౌకలు జలసంధికి పశ్చిమాన చిక్కుకుపోయి ఉన్నాయి. వీటిని భారత్ కు రప్పించేందుకు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి.
India, & #Gujarat in particular, hold a cherished place in our shared history; having graciously welcomed those from our land centuries ago.
Building on this enduring civilizational bond, we remain committed to further strengthening the ties of friendship & cooperation.#Iran https://t.co/KHruteGkY2
— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) April 4, 2026