Reading Time: < 1 minute

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలోకి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రాజమండ్రి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు యువకులు నదిలో స్నానానికి వెళ్లారు. అందులో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరంతా రాజమండ్రి జాంపేటకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించా రు. గోదావరి నదిలో లోతుగా ఉండటం గమనించని యువకులు, బోర్డులు ఏర్పాటు చేసినా పట్టించుకోకుండా నదిలో దిగి ప్రాణాలు పోగొట్టుకు న్నారు. పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక మృతదేహం లభ్యమయింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నా యి.