
- రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్ ఒక రాజకీయ వ్యభిచారిలా వ్యవహరిస్తున్నదని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. ఒక్కో చోట ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుంటూ బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీజేపీతో, మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో సీపీఐతో పొత్తు పెట్టుకోవడం వారి అవకాశవాదానికి నిదర్శనమని తెలిపారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ దౌర్జన్యాలకు పాల్పడిందని, అక్కడ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయమని చెప్పారు.