Reading Time: < 1 minute
ఏపీలో భూకంపం.. భయంతో వణికిపోయిన ప్రజలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతం అర్ధరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాడేరు ఏజెన్సీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలు గిరిజన ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. గాఢ నిద్రలో ఉన్న జనం, భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. శనివారం రాత్రి 11:31 గంటల సమయంలో అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.