
ఇస్లామాబాద్: ఇండియాపై నిత్యం విషం చిమ్మే పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈసారి భారత్ తమపై ఏదైనా దాడి చేస్తే తమ ప్రతిస్పందన సరిహద్దుల వరకే పరిమితం కాదని.. ఇండియా లోపలికి చొచ్చుకెళ్లి మరీ అటాక్స్ చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఇండియా ఏదైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే ఈసారి తమ టార్గె్ట్ కోల్కతా అవుతుందని మతిలేని మాట్లాడారు. భారతీయుల ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని బలుపు కూతలు కూశాడు. ఆర్ఎస్ఎస్ క్యాంప్ లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించాడు.
భారత నిర్భంధలో ఉన్న పాకిస్థానీయులతో ఒక ‘ఫాల్స్ ఫ్లాగ్’ కుట్రకు ఇండియా ప్లాన్ చేస్తోందని నిరాధార ఆరోపణలు చేశాడు. సొంత దేశంలో వారే దాడి చేసుకుని ఆ నిందను ఉగ్రవాదంపై మోపుతారని ఆరోపించాడు. ఖవాజా వ్యాఖ్యలపై ఇండియన్స్ భగ్గుమంటున్నారు. ఇండియాపై దాడి తర్వాత ముందు మీ దేశ ప్రజలకు మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టడంటూ చురకలంటిస్తున్నారు. మంత్రలకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని వారు కూడా యుద్ధాలు చేస్తామంటూ బీరాలు పలుకుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. భారత్ చేతిలో ఇప్పటికే ఎన్నోసార్లు చావు దెబ్బతిన్న పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదంటూ విమర్శిస్తున్నారు.
►ALSO READ | అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విఫలం! రెండు హెలికాప్టర్లు, C-130 విమానం కూల్చేశామన్న ఇరాన్
ఖవాజా కామెంట్స్ కేవలం వారిలోని భయం, నిస్సహాయతను సూచిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘన్ తాలిబన్లతో యుద్ధం చేస్తోంది. దేశంలోనే బలూచిస్థాన్, పంజాబ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజల తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉంది. వీటిని అదుపు చేయలేక, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కలేక.. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇండియాను బూచిగా చూపిస్తోంది. ఏ దేశమైనా యుద్ధం చేయాలంటే గుండె ధైర్యంతో పాటు ఖజానాలో డబ్బు కూడా ఉండాలి. మరీ ప్రస్తుతం పాకిస్థాన్ సిట్యూవేషన్ చూస్తే కనీసం తన దేశంలోని మంత్రులకే జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండి భారీ యుద్ధాన్ని ఎలా కొనసాగిస్తుందన్నదే అతిపెద్ద ప్రశ్న.