Reading Time: < 1 minute

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. కేరళలోని పథనంథిట్టలోని తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఈశాన్య రాష్ట్రాల తరహాలో అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని అన్నారు. పశ్చిమాసియా అంశంపై కాంగ్రెస్ నేతలు భయాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లు కోల్పోతాయని వస్తోన్న వాదనలు అవాస్తమని తేల్చి చెప్పారు.

ఆ తర్వాత శబరిమల రైల్వే ప్రాజెక్టు గురించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కొత్త అవకాశాలు తీసుకురాగలదని పేర్కొన్నారు. ఇది శబరిమలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, స్థానిక వ్యాపారులకు కొత్త ఊపునిస్తుందని చెప్పారు. యువతకు కొత్త ఉపాధి మార్గాలను తెలుస్తుందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తే.. ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు.