
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తుంది. వరుసగా సినిమాలు చేయకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది. బాహుబలి సినిమా తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించింది ఈ అందాల భామ. అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్న అనుష్క ఆతర్వాత పెద్దగా విజయాన్ని అందుకోలేక ఉయింది. చివరిగా ఘాటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఓ మలయాళ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే పోస్టర్ ను విడుదల చేశారు.
ఇదిలా ఉంటే అనుష్కను కాలితో తన్నాను అని చెప్పి షాక్ ఇచ్చాడు. అనుష్కను కాలితో తన్నా.. నావల్ల తనకు మెడనొప్పి వచ్చింది అని చెప్పాడు ఆ హీరో.. ఇంతకూ ఆ హీరో ఎవరంటే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడవి శేష్. ఈ యంగ్ హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు డెకాయిట్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు.
డెకాయిట్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అడవి శేష్ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి సినిమా సమయంలోనే మెమొరీస్ ను గుర్తు చేసుకున్నారు. బాహుబలి సినిమాలో అడవి శేష్ చిన్న పాత్రలో కనిపించాడు. భల్లాలదేవుడి కొడుకుగా కనిపించాడు శేష్. అనుష్క గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా మంచి వ్యక్తి. సినిమాలో ఓ సీన్ లో ఖైదీగా పడి ఉన్న అనుష్కను కట్టెతో తడుతూ నిద్రలేపాలి.. ఆ సీన్ అయిన తర్వాత దెబ్బ తగిలిందా అని అడిగా.. కానీ అప్పటికే నా వల్ల తనకు దెబ్బ తగిలింది. నేను కాలితో తన్నడం వల్ల ఆమె మెడ నొప్పితో బాధపడింది.నిజానికి ముందు నేను నెమ్మదిగానే తన్నా.. కానీ రాజమౌళి గారే సరిపోదు గట్టిగా తన్ను అన్నారు. దాంతో బలవంతంగా తన్నాల్సి వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.