Reading Time: < 1 minute

అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను  ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Caption of Image.

జూబ్లీహిల్స్, వెలుగు: అంబేద్కర్ దళిత్ స్టడీ సర్కిల్​ను రాష్ట్రవ్యాప్తంగా ఒక ఆదర్శవంతమైన విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఎస్.పి.ఆర్ హిల్స్​లో ఉన్న స్టడీ భవనాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్, స్టడీ సెంటర్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు.

భవనంలోని వసతి గృహ గదులు, భోజనశాల, గ్రంథాలయం, స్టడీ హాల్​ను సందర్శించి అక్కడి సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. దళిత విద్యార్థుల సామాజిక, విద్యాభివృద్ధికి ఈ స్టడీ సర్కిల్ కీలక వేదికగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.