Reading Time: < 1 minute

ఖబడ్దార్ బాల్క సుమన్.. చెన్నూరులో హింసను ప్రోత్సహిస్తే ఊరుకోం: మంత్రి వివేక్

Caption of Image.

మంచిర్యాల: ఖబడ్దార్ బాల్క సుమన్.. చెన్నూరులో హింసను ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదని మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. హింసను ప్రోత్సాహించే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం (ఏప్రిల్ 4) జరిగిన క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై మంత్రి వివేక్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలో ఈ సారి ప్రజాస్వామ్య పద్ధతిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికే అందుకు నిదర్శమని పేర్కొన్నారు. 

మొదటి నుంచి ఎన్నికలు సజావుగా సాగేందుకు మేం సహకరించామని.. కానీ బాల్క సుమన్, బీఆర్ఎస్ లీడర్లు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే బాల్క సుమన్, బీఆర్ఎస్ శ్రేణులు మా కాన్వాయ్‎పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బెదిరించి ఏకగ్రీవాలు చేసి ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న చరిత్ర బాల్క సుమన్‎దని విమర్శించారు.  బాల్క సుమన్ మాదిరిగా బెదిరింపు, రౌడీ రాజకీయాలు మేం ఎప్పుడు చేయలేదు.. భవిష్యత్‎లో కూడా చేయబోమని పేర్కొన్నారు. 

ALSO READ : ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా

అలా చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదన్నారు. గత ఎన్నికల్లో సుమన్ తమను బట్టలిప్పి కొడతానని వ్యాఖ్యలు చేసినందుకే చెన్నూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని.. మళ్లీ అలాగే వ్యవహరిస్తే ఈసారి కూడా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని, చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని.. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‎గా ఎన్నికైన వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 

 

©️ VIL Media Pvt Ltd.