
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఐపిఎల్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో ఓ సిక్సు బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మొత్తం 51 సిక్సర్లు కొట్టాడు.
అయితే ఐపిఎల్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనీ రికార్డును రోహిత్ అధిగమించాడు. ధోనీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 50 సిక్సులు బాదాడు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో సిక్సుతో ధోనీని రోహిత్ దాటేశాడు. ఇక ఈ విభాగంలో రోహిత్, ధోనీ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ సిఎస్‌కెపై 48 సిక్సులు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపిఎల్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్.. పంజాబ్‌పై 61, కెకెఆర్‌పై 54 సిక్సులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాడు.